అదిలాబాద్ అర్బన్: ఈనెల 28న చలో నవశక్తి దుర్గామాత పాదయాత్ర
దసరా శరన్నవరాత్రులను పురస్కరించుకొని వైశ్య రక్షక్ ఆధ్వర్యంలో చలో నవశక్తి దుర్గామాత ఆలయానికి పాదయాత్రను ఈనెల 28న ఆదివారం సాయంత్రం 5 గంటలకు చేపడుతున్నట్లు హిందూ సమాజ్ ఉత్సవ సమితి అధ్యక్షుడు హనుమాన్లు తెలిపారు. బుధవారం ఆదిలాబాద్ లోని కన్యక పరమేశ్వరి ఆలయంలో పాదయాత్ర కరపత్రాలను ఆవిష్కరించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పాదయాత్రను విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు ప్రమోద్, ప్రవీణ్, కృష్ణ, మహేందర్, సౌరబ్ పాల్గొన్నారు