ఒంగోల్ రిమ్స్ లో చికిత్స పొందుతున్న మార్కాపురం బస్సు ప్రమాద బాధితులను పరామర్శించిన కందుకూరు ఎమ్మెల్యే
Ongole Urban, Prakasam | Mar 27, 2026
మార్కాపురం సమీపంలో జరిగిన బస్సు ప్రమాదంలో గాయపడి ఒంగోలు రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు శుక్రవారం పరామర్శించారు. బాధితులతో మాట్లాడి ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రులు డోలా బాలవీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవికుమార్ సహా ఇతర ప్రజాప్రతినిధులు కూడా పాల్గొన్నారు. వలేటివారిపాలెం మండలం అంకభూపాలపురం గ్రామానికి చెందిన బత్తుల మణెమ్మ తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతుండగా, ఎమ్మెల్యే ప్రత్యేకంగా ఆమెను ప్రత్యేకంగా పరామర్శించి ఆర్థిక సాయం అందించారు