ఉదయగిరి: నరవాడలోని శ్రీ వెంగమాంబ పేరంటాలు దేవస్థానం అర్చకులు హఠాత్ మరణం
దుత్తలూరు మండలం,నర్రవాడ శ్రీ వెంగమాంబ పేరంటాలు దేవస్థానంలో అర్చకులుగా విధులు నిర్వహిస్తున్న సురేష్ స్వామి ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. విజయదశమి సందర్భంగా వచ్చిన భక్తులకు అమ్మవారి పూజలు నిర్వహిస్తూ తీర్థ ప్రసాదాలు పంచి పెడుతూ ఒక్కసారిగా కింద పడిపోయారు. హుటా హుటిన హాస్పిటల్కి తరలించగా ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో విషాదం నెలకొంది.