సూర్యాపేట: యువత గంజాయి మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి:సూర్యాపేట షీ టీం ఎస్సై నీలిమ
సూర్యాపేట జిల్లాలోని యువత గంజాయి మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూర్యాపేట షీ టీం ఎస్ఐ నీలిమ సోమవారం సూచించారు. ఈ సందర్భంగా సూర్యపేట జిల్లాలోని నషా ముక్తి భారత్ అభియాన్ లో భాగంగా ఇమాంపేట ఆదర్శ పాఠశాలలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. మాలిక ద్రవ్యాల రహిత సమాజాన్ని నిర్మించడంలో ప్రతి ఒక్కరు బాధ్యతగా ఉండాలని ఆమె సూచించారు.