హిమాయత్ నగర్: పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలి : ఓయూలో ఎంఎస్ఎఫ్ రాష్ట్ర అధికార ప్రతినిధి శేఖర్ మాదిగ
పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని ఎమ్మెస్ఎఫ్ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద సోమవారం మధ్యాహ్నం నిరసనకు దిగారు. ఈ సందర్భంగా ఎంఎస్ఎఫ్ రాష్ట్ర అధికార ప్రతినిధి శేఖర్ మాదిగ మీడియాతో మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ మైనారిటీలు ఉన్నత విద్యా చదవకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుకుంటుందని మండిపడ్డారు. విద్యార్థుల జీవితాలతో రాష్ట్ర ప్రభుత్వం చెలగాటం మాడుతుందని ధ్వజమెత్తారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకుండా ప్రాజెక్టుల పేరు మీద వేల కోట్లు ఎలా ఖర్చు పెడుతున్నారని ఆయన ప్రశ్నించారు.