గద్వాల్: పట్టణంలో ఉచిత వైద్య సేవ కార్యక్రమం: డాక్టర్ పి మానసవీణ
గద్వాల పట్టణం వేదనగర్ కాలనీలో ఆదివారం మధ్యాహ్నం దయానంద విద్యా సమితి ఆధ్వర్యంలో ఉచిత వైద్య సేవ కార్యక్రమం నిర్వహించారు. డాక్టర్ దామ వంశీ, డాక్టర్ పి.మానసవీణ వైద్య సేవలు అందించారు. ప్రతి ఒక్కరికి బీపీ, షుగర్, టెస్టులు చేసి అవసరమైన మందులను ఉచితంగా ఇచ్చారు. దాదాపు 120 మందికి పరీక్షలు నిర్వహించి ఉచిత మందులు ఇచ్చినట్లు డాక్టర్లు తెలిపారు. ప్రతి ఆదివారం ఉచిత వైద్య సేవలు ఉంటాయన్నారు.