మహా శివరాత్రి సందర్భంగా ఈనెల 8వ తేదీ నుంచి 18 వరకు శ్రీశైలంలో, మహానంది లో బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ బ్రహ్మోత్సవాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కు శ్రీశైలం ఎమ్మెల్యే శ్రీ బుడ్డా రాజశేఖర రెడ్డి, ఆలయ బోర్డు ఛైర్మన్ రమేష్ నాయుడు,ధర్మకర్తల మండలి సభ్యులు, అధికారులతో కలసి క్యాంప్ కార్యాలయంలో ఆహ్వానించారు ఈ సందర్భంగా స్వామివారి చిత్రపటం,ప్రసాదాలను సీఎం చంద్రబాబుకు అందజేశారు ఆలయ పండితులు వేద మంత్రోచ్ఛారణలతో ఆశీర్వచనం ఇచ్చారు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి, ఆలయ బోర్డు సభ్యులు సీఎంకు వివరించారు.