సంక్రాంతి వేడుకల పేరున కోడిపందేలు బరులకు పందెం రాయుళ్లు సిద్ధం అవుతున్నారు. పందేల నిర్వహణకు, జూదక్రీడలకు ప్రాంగణాలను ముస్తాబు చేస్తున్నారు. కొయ్యలగూడెం మండలం రాజవరంలో కోడి పందేల నిర్వహణకు, జూద క్రీడల నిర్వహణకు సుమారు ఎకరం విస్తీర్ణంలోని భూమిని చదును చేసే ప్రక్రియను నిర్వహకులు ప్రారంభించారు.