నిరుపేదల పాలిట వరం సీఎం రిలీఫ్ ఫండ్: బనగానపల్లెలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి
ముఖ్యమంత్రి సహాయ నిధి అనారోగ్యంతో బాధపడుతున్న నిరుపేదల పాలిట వరంగా మారిందని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. బుధవారం ఉదయం మంత్రి క్యాంపు కార్యాలయంలో 41 మంది బాధితులకు రూ.25,90,796 విలువైన చెక్కులను అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం పేద ప్రజల ఆరోగ్యానికి అండగా నిలుస్తూ కొండంత భరోసానిస్తోందన్నారు.