నారాయణ్‌ఖేడ్: ఖేడ్‌లో బైపాస్ రోడ్డు ను వెంటనే నిర్మించాలి: నారాయణఖేడ్‌లో మాజీ సర్పంచ్ డిమాండ్
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మున్సిపాలిటీలో సేవాలాల్ చౌక్ నుండి మహాత్మా గాంధీ చౌక్ వరకు గోతుల మయంగా ఉన్న రహదారిని బాగు చేయాలని మాజీ సర్పంచ్ నజీబ్ డిమాండ్ చేశారు. బుధవారం బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మాట్లాడుతూ రహదారిపై వరి నాట్లు వేసి నిరసన తెలిపిన అనంతరం మాట్లాడారు. గత ప్రభుత్వంలో రహదారి నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయని తెలిపారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం రోడ్డు పనులు చేపట్టడం లేదని విమర్శించారు. వెంటనే నిర్మించి ప్రయాణికుల సమస్య పరిష్కారం చేయాలని కోరారు.