నాయుడుపేటలో ఘనంగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల డైరెక్టర్ల ప్రమాణ స్వీకారం
తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గ పరిధిలోని ఆరు మండలాల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమాన్ని మంగళవారం అటాహసంగా నిర్వహించారు. నాయుడుపేటలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సూళ్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ, నెల్లూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్ మెట్టుకు ధనుంజయ రెడ్డి, మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం విచ్చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నూతన అధ్యక్షులు, డైరెక్టర్ల బృందం సంయుక్తంగా రైతుల సంక్షేమానికి అహర్నిశలు కృషి చేయాలని సూచించారు. సహకార సంఘం ద్వారా సకాలంలో రైతులకు రుణాలు, ఇతర సేవలు అందేలా చూడాలని తెలియజేశారు. ఈ కార్యక్రమ