గంగాధర నెల్లూరు: జక్కదొన పంచాయతీ నచ్చుకూరు వద్ద తెగిపోయిన రోడ్డు
వెదురుకుప్పం మండలంలో భారీ వర్షం కురిసింది. జక్కదొన పంచాయతీ నచ్చుకూరు వద్ద ఏరు పొంగి ప్రవహిస్తోంది. బుధవారం రహదారికి గండి పడటంతో గ్రామస్థులు గుర్తించి అధికారులకు సమాచారం అందించారు. జక్కదొన పంచాయతీతో పాటు అటువైపుగా వెళ్లే ఇతర ప్రయాణికులను అప్రమత్తం చేశారు. వెదురుకుప్పం మండలంలో దాదాపు అన్ని వాగులు వంకల్లో వరద నీరు భారీగా ప్రవహిస్తోంది.