మోపిదేవి మండలం కోసూరు వారి పాలెం ఎంపీటీసీ సభ్యుడు వెంకట రాజేశ్ రాజీనామా
Machilipatnam South, Krishna | Sep 16, 2025
మోపిదేవి మండలం కోసూరు వారి పాలెం ఎంపీటీసీ సభ్యుడు వెంకట రాజేశ్ రాజీనామా అధికారుల నిర్లక్ష్యంతో కోసూరు వారి పాలెం ఎంపీటీసీ సభ్యుడు సనకా వెంకట రాజేశ్ బాబు రాజీనామా చేశారు. మంగళవారం మద్యాహ్నం 3 గంటల సమయంలో స్తానిక మోపిదేవి మండల పరిషత్ కార్యాలయంలో తన రాజీనామా లెటర్ ను ఎంపీడీవో జంగం స్వర్ణ భారతికి అందజేసినట్లు ఎంపీటీసీ సభ్యుడు తెలిపారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ..గ్రామంలో జరిగే ప్రతి కార్యక్రమానికి అధికారుల నిర్లక్ష్యంతో తనను పిలవడం లేదని, నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేసినట్లు తెలిపారు.