ఇద్దరు ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్టు చేసిన తిరుపతి టాస్క్ ఫోర్స్
అన్నమయ్య జిల్లా అటవీ ప్రాంతంలో 10 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకొని ఇద్దరు స్మగ్లర్లను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు.నొక్కోడి గుండం వద్ద కొంతమంది వ్యక్తులు ఎర్రచందనం దుంగలు మోసుకొని వెళుతూ కనిపించారు. దీంతో టాస్క్ఫోర్స్ టీం వారిని చుట్టుముట్టగా కొంతమంది వారిలో తప్పించుకోగా ఇద్దరిని అరెస్టు చేశారు. వారితో పాటు 10 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకొని తిరుపతి ట్రాన్స్పోర్ట్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.