శ్రీకాకుళం: ఓజోన్ పొరను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది: జన విజ్ఞాన వేదిక ఎడ్యుకేషన్ సబ్ కమిటీ రాష్ట్ర కన్వీనర్ గొంటి గిరిధర్
ఓజోన్ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా శ్రీకాకుళం జిల్లా, ఆముదాలవలస ప్రభుత్వ పాఠశాలలో మంగళవారం సాయంత్రం జనవిజ్ఞాన వేదిక ఎడ్యుకేషన్ సబ్ కమిటీ రాష్ట్ర కన్వీనర్ గొంటి గిరిధర్ మాట్లాడుతూ ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ తీర్మానం మేరకు మాంట్రియల్ అగ్రిమెంట్ తేదీ సెప్టెంబర్ 16న ప్రపంచవ్యాప్తంగా ఓజోన్ పరిరక్షణదినాన్ని నిర్వహించుకుంటున్నామని ఆచరణలో ఐక్యరాజ్యసమితి కాలుష్యకారక విషాలను విడుదల చేస్తున్న, క్లోరోఫ్లోరో కార్బన్లను అత్యధికముగా విడుదల చేస్తూ ఓజోన్ పోరను నాశనం చేస్తున్న దేశాలను నియంత్రించడం, పర్యావరణ పరిరక్షణ కోసం నిధులు కేటాయింపు పెంచడం,ప్రజలకు పర్యావరణ స్పృహ కల్పించాలాన్నారు.