న్యూ రాజరాజేశ్వరి పేట డయేరియా మెడికల్ క్యాంపులో సరైన వైద్యం అందించడం లేదని మహిళ ఆందోళన
విజయవాడ న్యూ రాజరాజేశ్వరి పేటలోని డయేరియా మెడికల్ క్యాంపులో సరైన వైద్యం అందించడం లేదని ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. మంగళవారం మధ్యాహ్నం సమయంలో తన కుమారుడికి విరోచనాలు, జ్వరంతో డయేరియా మెడికల్ క్యాంపు తీసుకొచ్చింది. వైద్య సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించాలని తన కుమారుడికి విరోచనాలు అవుతుంటే జ్వరానికి టాబ్లెట్ ఇచ్చి వెళ్ళిపోమని చెప్పారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. చిన్నపిల్లలు విరోచనాలను తట్టుకోగలరా అంటూ ప్రశ్నించారు. అధికారులు మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు