కుప్పం: కుప్పం ప్రభుత్వ డిగ్రీ కళాశాల హాస్టల్ బిల్డింగ్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్
గుడిపల్లి మండలంలోని కుప్పం ప్రభుత్వ డిగ్రీ కళాశాల హాస్టల్ బిల్డింగ్ నిర్మాణానికి ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ గురువారం నాడు ఉదయం పది గంటల ప్రాంతంలో భూమి పూజ చేశారు. సీఎం చంద్రబాబు హాస్టల్ బిల్డింగుకు రూ. 3.25 కోట్లు మంజూరు చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యా సంక్షేమ మౌలిక వసతుల అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్ రాజశేఖర్, టీటీడీ బోర్డు మెంబర్ శాంతారాం పాల్గొన్నారు.