మంచిర్యాల: ప్రజాపాలన దినోత్సవ కార్యక్రమాలలో పాల్గొన్న అధికారులు, నాయకులు
మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట మున్సిపాలిటీలో ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా బుధవారం ఉదయం మున్సిపల్ కార్యాలయం, తహసీల్దారు కార్యాలయం, మండల పరిషత్ కార్యాలయాలతో పాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో అధికారులు జాతీయ జెండాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతానికి నిజాం పాలన నుంచి 1948 సెప్టెంబర్ 17న విముక్తి కలిగిన నేపథ్యంలో ప్రజాపాలన దినోత్సవంగా రాష్ట్ర ప్రభుత్వం పలు కార్యక్రమాలు చేపట్టిందనీ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా ప్రభుత్వ కార్యాలయాలు, పట్టణ, గ్రామీణ స్థానిక సంస్థల్లో జాతీయ జెండా ఎగురవేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపారు.