పులివెందుల: రైతులకు సకాలంలో యూరియాను సరఫరా చేయాలి : పులివెందుల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ధ్రువ కుమార్ రెడ్డి డిమాండ్
Pulivendla, YSR | Sep 15, 2025 రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా యూరియా ఎరువులు లభించక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పులివెందుల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ధ్రువ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. కొంతమంది వ్యాపారులు యూరియా కొరతను సృష్టించి బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటున్నారని ఆరోపించారు. అందుకు నిరసనగా కడప కలెక్టరేట్ కార్యాలయం నందు కాంగ్రెస్ నాయకులతో కలిసి వినతిపత్రం అందజేసినట్లు ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే రైతులకు యూరియాను సరఫరా చేయాలని బ్లాక్ మార్కెట్‌ను అరికట్టాలని డిమాండ్ చేశారు.