మానవులు ఆరుగురిని పూజించిన తర్వాత దేవుడిని పూజించాలని తొగుట పీఠాధిపతి మాధవ ఆనంద సరస్వతి మహారాజ్ తెలిపారు. నారాయణఖేడ్ పట్టణంలో తహసీల్ మైదానంలో సోమవారం రాత్రి నిర్వహించిన కార్తీక దీపోత్సవం, శ్రీదేవి భూదేవి సమేత లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో భక్తులకు ప్రవచనం చేశారు. తల్లిదండ్రులు, అత్తమామలు, గురువు, ఆపదలో ఆదుకునే వ్యక్తిని పూజించిన అనంతరం దేవుడిని పూజించాలని సూచించారు.