అదిలాబాద్ అర్బన్: కేంద్ర ప్రభుత్వ చేపడుతున్న స్వస్ట్ నారి సశక్త్ పరివార్ అభియాన్ ఆరోగ్య శిబిరంలో పాల్గొన్న ఆదిలాబాద్ ఎంపీ నగేష్
మహిళలు ఆరోగ్యంగా ఉంటే ఆ కుటుంబం ఆరోగ్యంగా ఉంటుందని, అటు దేశం సైతం ఆరోగ్యవంతమవుతోందని ఎంపీ గోడం నగేష్ అన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు చేపట్టిన స్వస్ట్ నారి సశక్త్ పరివార్ అభియాన్ ఆరోగ్య శిబిరంలో జిల్లా కలెక్టర్ రాజర్షి షా తో కలిసి ఎంపీ పాల్గొన్నారు. స్థానిక హమాలివాడ అర్బన్ హెల్త్ సెంటర్ లో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం గర్భిణీలకు, మహిళలకు వైద్య పరీక్షలు చేపట్టారు. అదేవిధంగా పేదలకు ఫుడ్ కిడ్స్ లను పంపిణీ చేశారు. అనంతరం ఆరోగ్యవంతమైన జీవితం కోసం ప్రతిజ్ఞ చేయించారు