జగిత్యాల: వెల్దుర్తి గ్రామంలో 10 లక్షలతో నూతనంగా నిర్మించనున్న పశు వైద్యశాల నిర్మాణానికి భూమిపూజ చేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
జగిత్యాల రూరల్ మండలం వెల్దుర్తి గ్రామంలో 10 లక్షల నిధులతో నూతనంగా నిర్మించనున్న పశు వైద్యశాల నిర్మాణానికి జగిత్యాల శాసనసభ్యులు డా సంజయ్ కుమార్ సోమవారం ఉదయం 11-30 గంటల ప్రాంతంలో భూమిపూజ చేశారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ....పశువులు ఆరోగ్యంగా ఉన్నప్పుడే రైతులు ఆర్థికంగా అభివృద్ధి సాధ్యం అ వుతుందని అన్నారు.నేడు దేశంలో పశు సంపద తగ్గి జనాభా పెరుగుదల ఎక్కువ కావడం ఆందోళనకరం అన్నారు.పశువులకు సీజనల్ వ్యాధులు రాకుండా గ్రామాలలోనే నాణ్యమైన పశు వైద్యం అందించేలా ప్రత్యేక వైద్యశాలలకు ప్రభుత్వం నిధులు మంజూరు చేయటం జరిగిందన్నారు.