అనంతపురం జిల్లాలోని గార్లదిన్నె సమీపంలో ఉన్న లోలూరు క్రాస్ వద్ద రైలులో నుంచి పడి బీహార్ కు చెందిన ప్రయాణికుడికి తీవ్ర గాయాలైన సంఘటన శుక్రవారం సాయంత్రం చోటు చేసుకుంది. ఈ ఘటనతో అతనిని 108 సహాయంతో అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.