తాంసీ: తాంసి పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ గౌష్ ఆలం
Tamsi, Adilabad | Nov 11, 2024 పోలీస్ స్టేషన్ కు వచ్చే ఫిర్యాదు దారుల పట్ల పోలీస్ సిబ్బంది బాధ్యతాయుతంగా వ్యవహరించాలని జిల్లా ఎస్పీ గౌష్ ఆలం తెలిపారు.సోమవారం తాంసి మండల పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ పరిసరాలను పరిశీలిస్తూ పోలీస్ స్టేషన్ ను ఎప్పటికప్పుడు పరిశుభ్రతతో ఉంచుకోవాలని సూచించారు.పోలీస్ స్టేషన్ చుట్టుపక్కల ఎలాంటి చెత్త చెదారం, అనవసర మొక్కలు లేకుండా ఎప్పటికప్పుడు శుభ్రపరుస్తూ ఉండాలని సూచించారు.ఎవరు సందర్బంగా స్టేషన్ ఆవరణలో మొక్కను నాటారు.రిసెప్షన్, లాకప్, రికార్డులు భద్రపరిచే గది, సాక్షదారాలను భద్రపరిచే గది, సిబ్బంది వేచి ఉండే ప్రదేశం పరిశీలించి ఎస్ఐ శివరాంకు పలు సూచనలు చేశారు.