సూర్యాపేట: సూర్యాపేటలో 30 కోట్లు దుర్వినియోగం:, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వేనారెడ్డి
సూర్యాపేటలో మోడల్ మార్కెట్ పేరుతో రూ. 30 కోట్ల నిధులు దుర్వినియోగం చేసిందని సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేనారెడ్డి బిఆర్ ఎస్ పై బుధవారం ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా సూర్యపేటలో ఆయన మాట్లాడుతూ కమిషన్ల కోసం కకృతి పడి మోడల్ మార్కెట్ను ఇష్టారాజ్యంగా కట్టారన్నారు. సూర్యాపేట జిల్లాలో ప్రజల సొమ్మును సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి దోచుకున్నారని విమర్శించారు.