రాప్తాడు: రాప్తాడులో డ్రిల్లింగ్ పనులు చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్కు గురై కార్మికుడి మృతి
రాప్తాడు మండల కేంద్రంలోని ఆటో నగర్ లో డ్రిల్లింగ్ పనులు చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్కు గురై షేక్ ఫక్రుద్దీన్ అనే వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు షేక్ ఫక్రుద్దీన్ తోటి కార్మికులతో కలిసి డ్రిల్లింగ్ పనులు చేస్తున్న సమయంలో విద్యుత్ షాక్ కు గురై మృతి చెందాడు. ప్రాణం ఉందనే ఆశతో ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.