నకరికల్లు మండల కేంద్రంలో మౌలిక సదుపాయాలపై స్థానికులు ఆందోళన
పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గ నకరికల్లు మండల కేంద్రంలోని గొల్లపల్లి ఇందిరమ్మ కాలనీ ప్రజలు తీవ్ర సమస్యలతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం సాయంత్రం ఐదు గంటల సమయంలో కాలనీవాసులు మాట్లాడుతూ రాత్రి వేళలో కరెంటు కోతలు కాలనీలో మంచినీటి సరఫరా లేకపోవడం సిమెంట్ రోడ్లు అద్వానంగా ఉండడంతో ఇబ్బందులు పడుతున్నట్లుగా పేర్కొన్నారు. బస్సు ఆగక కిలోమీటర్ నడవాల్సి వస్తుందని గుత్తికొండ వరకే టికెట్లు ఇస్తున్నారని ఆరోపించారు. అధికారులు వెంటనే స్పందించి తమ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.