తాడిపత్రి: 12వ పీ ఆర్ సీ కమిషన్ వెంటనే వేసి ఐ ఆర్ ప్రకటించాలి: యాడికి లో పీ ఆర్ టీ యూ రాష్ట్ర కార్యదర్శి కేశవ నాయుడు
12వ పీ ఆర్ సీ కమిషన్ వెంటనే వేసి ఐ ఆర్ ప్రకటించాలని పీ ఆర్ టీ యూ రాష్ట్ర కార్యదర్శి కేశవ నాయుడు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు రవీంద్ర డిమాండ్ చేశారు. యాడికి మండల పరిషత్ కార్యాలయం వద్ద పీ ఆర్ టీ యూ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఉపాధ్యాయులు కు రావలసిన అనేక ఆర్థిక బకాయిలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలన్నారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు.