అల్లూరి జిల్లా పాడేరు జిల్లా ఆస్పత్రి వద్ద ఉద్రిక్త వాతావరణం
పాడేరు కేంద్రం జిల్లా ఆసుపత్రి వద్ద నిన్న రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ప్రవీణ్ కుటుంబ సభ్యులు గ్రామస్తుల ఆందోళన చేపట్టారు. సోమవారం రాత్రి 8 గంటల సమయంలో పాడేరు తల సింగ్ వద్ద ఐటీడీఏ బంకు ముందు జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ప్రవీణ్ కుటుంబ సభ్యులు గ్రామస్తులు తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా ఆసుపత్రి ఎదుట బైఠాయించారు. ప్రమాదం జరిగి రోజు గడుస్తున్న ప్రమాదానికి కారణమైన వారు కనీస స్పందన లేదని ప్రమాదం జరిగిన వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్లాలనే ఇంగిత జ్ఞానం కూడా లేకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వారిపై చర్యలు చేపట్టాలని బుధవారం ఉదయం 11 గంటల సమయంలో నిరసన చేపట్టారు.