కొండపి: బేస్తవారిపేటకు చెందిన ఆర్మీ ఉద్యోగి వెంకటరమణ ఆరోగ్యంతో రాజస్థాన్ లో మృతి
ప్రకాశం జిల్లా బేస్తవారిపేట కు చెందిన వెంకటరమణ అనే ఆర్మీ ఉద్యోగి అనారోగ్యంతో శుక్రవారం మృతి చెందారు. రాజస్థాన్లో విధులు నిర్వహిస్తున్న వెంకటరమణ కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందినట్లుగా అధికారులు వెల్లడించారు. అంత్యక్రియల కోసం వెంకటరమణ మృతదేహాన్ని బేస్తవారిపేటకు తరలిస్తున్నట్లు ఆర్మీ అధికారులు వెల్లడించారు.