శ్రీకాకుళం: భార్య వేరే వ్యక్తితో తిరుగుతుందని కుమార్తెకు విషమిచ్చి తాను తాగి ఆత్మహత్య చేసుకున్న సంచాం గ్రామానికి చెందిన భర్త
భార్య వేరే వ్యక్తితో తిరుగుతోందని భర్త కుమార్తెకు విషమిచ్చి తాను త్రాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలంలో చోటుచేసుకుంది. సంచాం గ్రామానికి చెందిన దుప్పాడ సంతోష్ కు ఇద్దరు భార్యలు. రెండో భార్య స్వాతిని ప్రేమ వివాహం చేసుకోగా విశాఖపట్నంలో వేర్వేరు ఇళ్లలో ఇద్దరు భార్యలతో కలిసి నివసిస్తున్నాడు. భార్య స్వాతి వేరే వ్యక్తితో తిరుగుతోందని తెలిసి మనస్థాపానికి గురై కుమార్తె హైమాకే విషమిచ్చి తాను ఆత్మహత్య చేసుకున్నాడు.. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటల 30 నిమిషాలకు వైరల్ గా మారింది.