కడప జిల్లా కమలాపురం నియోజకవర్గం పరిధిలోని వీరపు నాయుని పల్లె మండలం వీరపు నాయుని పల్లిలోని గ్రంథాలయంలో 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు గురువారం ఘనంగా ముగిశాయి. జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు కార్యక్రమం సందర్భంగా పిల్లలకు వివిధ పోటీలు నిర్వహించి విజేతలుగా నిలిచిన పిల్లలకు బహుమతులను అందజేశారు.ఈ సందర్బంగా వక్తలు మాట్లాడుతూ గ్రంథాలయాలు సమాజానికి జ్ఞానాన్ని పంచే కేంద్రాలన్నారు.ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, గ్రంథాలయాధికారి, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.