ఇప్పటివరకు గిద్దలూరు మున్సిపాలిటీ పరిధిలో అభివృద్ధి కొరకు రూ. 22 కోట్లు ఖర్చు చేసినట్లు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి అన్నారు. శనివారం పట్టణంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొని పనులకు శంకుస్థాపన చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ వరకు గిద్దలూరు మున్సిపాలిటీని అభివృద్ధి చేస్తున్నామని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.