ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి పై తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఫైర్ అయ్యారు. తాడిపత్రిలో సోమవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఆయన ప్రెస్మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి తాడిమర్రి మండలానికి హెచ్.ఎల్.సీ ద్వారా నీరు ఇవ్వాలని జిల్లా కలెక్టర్కు వినతి చేయడంపై జే సీ మండిపడ్డారు. తాడిమర్రి కి నీళ్లు రాకుండా పైపులు, ఇతరత్రా పరికరాలను ధ్వంసం చేయించి ఇప్పుడు తానేదో మేలు చేస్తున్నట్లు నాటకాలు ఆడుతున్నాడని ఆరోపించారు. పద్ధతి మార్చుకోవాలని హితవు పలికారు.