నారాయణ్‌ఖేడ్: శెలిగిర లో ఆర్ఎంపి క్లినిక్ ను సీజ్ చేసిన వైద్యశాఖ, పోలీస్ శాఖ అధికారులు
గత మూడు రోజుల క్రితం ఇంజక్షన్ వికటించి మనూర్ మండలం షెల్గిరకు చెందిన ప్రశాంత్ (14) మృతి చెందిన విషయం తెలిసిందే. సోమవారం డిప్యూటీ డీఎంహెస్ఓ సంధ్యారాణి, ఎస్సై కోటేశ్వరరావు గ్రామాన్ని సందర్శించారు. బాలుడి మృతికి గల కారణాలు అక్కడి స్థానికులను అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా క్లినిక్ నడపడం నేరమని అన్నారు. ఇంజక్షన్ వికటించి చనిపోయినట్టు ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతానికి క్లినిక్ని సీజ్ చేశారు.