ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈనెల 11వ తేదీన పీసీ పల్లి మండలం లింగన్నపాలెం గ్రామంలో మధ్య, చిన్న, సూక్ష్మతరహా పరిశ్రమల ( ఎం.ఎస్.ఎం.ఈ ) పార్కు ప్రారంభోత్సవానికి విచ్చేయుచున్న సందర్భంగా ముందస్తు ఏర్పాట్లను మంత్రి స్వామి ,జిల్లా కలెక్టర్ రాజబాబు,జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు, కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి మరియు జిల్లా అధికారులు పరిశీలించారు. జిల్లా ఆనంతరం ముఖ్యమంత్రి పర్యటన నిమిత్తం నియమించిన ప్రత్యేక అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి అధికారులకు పలు సూచనలు తెలియచేశారు. హెలిప్యాడ్ ప్రదేశం, సభ వేదిక, పార్కింగ్ ప్రాంతాలను పరిశీలించారు