కళ్యాణదుర్గం: కళ్యాణదుర్గంలోని రాచప్ప బావి కాలనీలో తిప్పే స్వామి (34) అనే వ్యక్తి ఉరి వేసుకొని ఆత్మహత్య
కళ్యాణదుర్గం పట్టణంలోని రాచప్ప బావి కాలనీకి చెందిన తిప్పేస్వామి(35) అనే వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన గురువారం చోటు చేసుకుంది. గమనించిన కుటుంబ సభ్యులు ప్రాణం ఉందనే ఆశతో ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. మృతునికి భార్య, ఒక కుమార్తె ఉన్నారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.