కొండపి: సింగరాయకొండ మండలం మూలగుంటపాడు లో వృద్ధురాలు మెడలో నుంచి బంగారు గొలుసు చోరీ చేసిన దొంగలు, దర్యాప్తు చేస్తున్న పోలీసులు
ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం మూలగుంటపాడులోని ఓ వృద్ధురాలి మెడలో 3సవర్ల బంగారు గొలుసును గుర్తుతెలియని వ్యక్తులు లాక్కెళ్లారు. సోమవారం యానాదమ్మతోపాటు మరో మహిళ బజారు నుంచి ఇంటికి నడిచి వెళ్తున్న సమయంలో బైక్పై వచ్చిన ఇరువురు గుర్తుతెలియని వ్యక్తులు మహిళ మెడలో బంగారపు గొలుసు బలవంతంగా లాక్కుని పరారయ్యారు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా CI హాజరత్తయ్య ఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు.