10 బొల్లవరం గ్రామంలో నాటు సారా అమ్ముతున్న వ్యక్తి అరెస్టు,10 లీటర్ల నాటు సారా స్వాధీనం, బ్రాహ్మణ కొట్కూరుఎస్సై మణికంఠ
నంద్యాల జిల్లా నందికొట్కూరు మండల పరిధిలోని 10 బొల్లవరం గ్రామంలో నాటు సారా అమ్ముతున్న ఒక వ్యక్తిని అరెస్టు చేసినట్లు బ్రాహ్మణ కొట్కూరు ఎస్సై శ్రీ వి. మణికంఠ తెలిపారు, ఆయన తెలిపిన వివరాల మేరకు సోమవారం రాత్రి గంటలకు నందికొట్కూరు షికారి పేటకు చెందిన నీలి షికారి సురేష్ 10 బొల్లవరం గ్రామంలో నాటు సారాయి అమ్ముతుండగా అతన్ని అరెస్టు చేసి అతని వద్ద నుండి 10 లీటర్ల నాటు సారాయిని స్వాధీనంలోకి తీసుకొని మంగళవారం రిమాండ్ కు పంపినట్లు బ్రాహ్మణ కోట్కూరు ఎస్సై మణికంఠ మంగళవారం సాయంత్రం తెలిపారు, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు, ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు