మేడ్చల్: ఘట్కేసర్ రైల్వే స్టేషన్ లో ఫలక్నామా ఎక్స్ప్రెస్ రైలులో తనిఖీలు
ఔరా నుండి సికింద్రాబాద్ వెళ్లే ఫలక్నుమా ఎక్స్ప్రెస్ రైలులో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారం మేరకు మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ రైల్వే స్టేషన్ లో రైల్వే పోలీసులు, స్థానిక పోలీసులు రైలును ఆపి తనిఖీలు చేపట్టారు. సుమారు అరగంట పాటు జరిగిన ఈ తనిఖీల్లో ఇప్పటివరకు ఎవరు పట్టుబడలేదు. తనిఖీలు కొనసాగుతున్నాయి.