మ్యుటేషన్లును త్వరగా పరిష్కరించాలి
: ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి అశుతోష్ శ్రీ వాస్తవ
గ్రామసభల్లో వచ్చిన మ్యూటేషన్లను వీలైనంత త్వరగా పరిష్కరించాలని ఐటిడిఎ ప్రోజెక్ట్ అధికారి అశుతోష్ శ్రీవాస్తవ తెలిపారు. పాచిపెంట మండలం మోసూరు గ్రామంలో రెవెన్యూ సమస్యలపై శుక్రవారం నిర్వహించిన గ్రామసభకు పీఓ హాజరై ఫిర్యాదులను స్వీకరించారు. భూ సవరణలకు సంబంధించి మ్యుటేషన్ కొరకు పెట్టుకున్న దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని సిబ్బందికి ఆయన ఆదేశించారు. గ్రామంలో ప్రైవేటు భూములతోపాటు గ్రామ సరిహద్దులు, నీటి వనరుల భూములు, పోరంబోకు భూములను కొలతలువేసి ఖచ్చితమైన సరిహద్దులను ఏర్పాటు చేయాలని అన్నారు. తద్వారా రైతులకు భూ యజమానులకు శాశ్వత మేలు జరుగుతుందని అన్నారు.