మచిలీపట్నం సర్వేజన హాస్పిటల్ వద్ద ఏఐటీయూసీ ఆధ్వర్యంలో శానిటేషన్ వర్కర్లు ఆందోళన
Machilipatnam South, Krishna | Sep 15, 2025
మచిలీపట్నం సర్వేజన హాస్పిటల్ వద్ద ఏఐటీయూసీ ఆధ్వర్యంలో శానిటేషన్ వర్కర్లు ఆందోళన చేపట్టారు. కృష్ణా జిల్లా వ్యాప్తంగా మెడికల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న శానిటేషన్ వర్కర్లకు కాంట్రాక్టర్ గత నాలుగు నెలలుగా జీతాలు చెల్లించలేదని, పీఎఫ్, ఈఎస్ఐలు సకాలంలో జమ చేయకుండా వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ నాయకులు ఈ నిరసనలో పాల్గొన్నారు.