పెనుగులూరు : నదిలో కొట్టుకుపోయిన మట్టి రోడ్డు- వంతెన నిర్మించాలని కోరుతున్న స్థానికులు
పెనగలూరు - నందులూరు మండలాలకు మధ్య చేయూరు నదిలో దెబ్బతిన్న దారిని తిరిగి పునర్దించాలని ఆ ప్రాంత వాసులు విజ్ఞప్తి చేస్తున్నారు. పై ప్రాంతంలో కురిసిన వర్షాల కారణంగా నదిలో వేసిన తాత్కాలిక మట్టి రోడ్లు దెబ్బతిని రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కోడి చిన్నయ్య గారి పల్లి పెనగలూరు మండలం పల్లంపాడు గ్రామాల మధ్య రోడ్డు లేక స్థానికలు ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ వంతెన నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు.