GHMC మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తామని జనసేన పార్టీ ప్రకటించిన నేపథ్యంలో పార్టీలో చేరికలు ఊపందుకున్నాయి. మల్కాజ్గిరి నియోజకవర్గానికి చెందిన డాక్టర్ వేణు ప్రసాద్ ఆదివారం కూకట్పల్లి నియోజకవర్గంలోని జనసేన పార్టీ కార్యాలయంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర జనసేన పార్టీ అధ్యక్షుడు నేమూరి శంకర్ గౌడ్ డాక్టర్ వేణు ప్రసాద్‌కు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. త్వరలో మల్కాజ్గిరి నియోజకవర్గంలో మరిన్ని చేరికలు ఉంటాయని తెలిపారు. రానున్న మున్సిపల్, GHMC ఎన్నికల్లో జనసేన పార్టీ బలంగా ముందుకు వెళ్లేందుకు సన్నద్ధమవుతోందని స్పష్టం చేశారు.