కోడూరు : జాతీయ రహదారి పనులకు 85 కోట్లు మంజూరు చేసిన రహదారుల మంత్రి ఘట్కరి
ఇటీవల ఢిల్లీలోని కడప - రేణిగుంట నేషనల్ హైవే నిర్మాణ పనులపై కేంద్ర రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ ని రైల్వే కోడూరు నియోజకవర్గ టిడిపి పార్టీ ఇంచార్జ్ మరియు KUDA చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి , బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరీ , అన్నమయ్య జిల్లా బీజేపీ అధ్యక్షుడు సాయి లోకేష్ తో కలిసి మర్యాదపూర్వకంగా ఇటీవల కలిశారు. ముక్కా రూపానంద రెడ్డి అభ్యర్థనపై సానుకూలంగా స్పందించిన గడ్కరీ తక్షణమే రూ.85 కోట్లు మంజూరు చేశారు. *ఈ నేపథ్యంలో తాజాగా ఈరోజు నుంచి హైవే రహదారి అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయి.*