బుధవారం చిత్తూరు పట్టణంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో చిత్తూరు వన్ టౌన్ ఇన్స్పెక్టర్ మహేశ్వర ఆధ్వర్యంలో సైబర్ నేరాలు మహిళలపై జరిగే నేరాలు మత్తుమందుల వాడకంతో ఏర్పడే ప్రమాదాలు రోడ్డు సేఫ్టీ గురించి విద్యార్థులకు తమ విలువైన సూచనలు చట్టపరమైన సమాచారంతో అవగాహన కల్పించారు ఈ l సందర్భంగా వన్ టౌన్ ఇన్స్పెక్టర్ మహేశ్వర్ మాట్లాడుతూ యువత మత్తుపదార్థాలకు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకోవాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు మత్తు వల్ల వ్యక్తి భవిష్యత్తు నాశనం అవుతుందని కుటుంబం కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.