గిద్దలూరు: కంభం మండలంలోని కంభం చెరువు అలుగు వద్ద తెగిపడ్డ విద్యుత్తు తీగలు, అధికారులకు సమాచారం ఇచ్చిన స్థానికులు, సరఫరా నిలిపివేత
ప్రకాశం జిల్లా కంభం మండలంలోని కంభం చెరువు అలుగు వద్ద విద్యుత్ తీగల తెగిపడ్డాయి. ఆదివారం స్థానికులు గుర్తించి వెంటనే విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో అధికారులు విద్యుత్ సరఫరా లో నిలిపివేశారు. అయితే అలుగు ఉధృతి అధికంగా ఉండడంతో ఎవరు అలుగులో లేకపోవడం వల్ల ఎటువంటి అపాయం జరగలేదని స్థానికులు తెలిపారు. విద్యుత్ శాఖ అధికారులు వెంటనే మరమ్మతులు చేపట్టి సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు.