ఎండిపియస్ దిగువతొట్ల వారి పల్లి మాదిగ పల్లె పర్యటనలో సమస్యలు వెల్లువ
అన్నమయ్య జిల్లా గుర్రంకొండ మండలం చెర్లోపల్లి గ్రామం దిగువతోట్లవారిపల్లి మాదిగ పల్లెకు చెందిన గ్రామస్తులు వారి గ్రామంలోని భూమి మరియు ఇంటి సమస్యలపై మాదిగ దళ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు పెద్దపల్లి శేఖర్ ని రాయచోటి పట్టణంలోని ఎండిపిఎస్ కార్యాలయంలో కలిసి వారి గ్రామంలోని సమస్యలను వివరించారు. గతంలో తమ గ్రామం పక్కనుండి హంద్రీనీవా కాలువ నిర్మాణం చేపట్టడం జరిగిందని,కాలువ నిర్మాణ సమయంలో తమ ఇండ్లు పూర్తిగా దెబ్బతిన్నాయన్నారు