జమ్మలమడుగు: కడప : షరతులు లేకుండా అర్హులైన ప్రతి ఆటో కార్మికుడికి వాహన మిత్ర పథకాన్ని అమలు చేయాలి - ఏఐటీయూసీ
ఆటో కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ఏపీ ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఏఐటీయూసీ అనుబంధం రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా కడప జిల్లా కడప నగర కమిటీ ఆధ్వర్యంలో సోమవారం కడప నగరంలోని ఆర్డిఓ ఆఫీస్ దగ్గర ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ కడప జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్. నాగసుబ్బారెడ్డి. ఏపీ ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఏఐటీయూసీ అనుబంధం కడప జిల్లా ప్రధాన కార్యదర్శి ఉద్దె. మద్దిలేటి. మాట్లాడుతూ షరతులు లేకుండా అర్హులైన ప్రతి ఆటో కార్మికుడికి వాహన మిత్ర పథకాన్ని అమలు చేయాలన్నారు.ఆటో కార్మికులకు పింఛన్తో కూడిన సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలన్నారు.