బిఆర్ఎస్ కాప్రా డివిజన్ అధ్యక్షుడిగా బైరి నవీన్ గౌడ్ నియమితులయ్యారు. ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి సమక్షంలో కాప్రా డివిజన్ కార్యకర్తలు, నాయకుల అందరి అభిప్రాయం మేరకు ఈ నియామకం జరిగింది. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా నవీన్ గౌడ్ ను ఎమ్మెల్యే అభినందించారు.